EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: సర్పంచ్ భూక్య రమేష్

    Author THADEM PRASHANTH | 19 Sep 2026, 07:54 PM | TELANGANA
    విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: సర్పంచ్ భూక్య రమేష్

    బంజరపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం

    విద్యార్థుల అభ్యసన పురోగతిపై చర్చ
    బంజరపల్లి, సెప్టెంబర్‌ 19, హిందుస్థాన్ మీడియా: బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీ యూపీఎస్‌ బంజరపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
    ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన స్థాయి, విద్యా పురోగతి, పాఠశాలలో వారి ప్రవర్తన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకుంటూ, ఉపాధ్యాయులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

    విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
    సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ మాట్లాడుతూ విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించే సూచనలు, సలహాలను పాటిస్తూ క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయుడు టింకు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.