విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: సర్పంచ్ భూక్య రమేష్

బంజరపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం విద్యార్థుల అభ్యసన పురోగతిపై చర్చ బంజరపల్లి, సెప్టెంబర్‌ 19, హిందుస్థాన్ మీడియా: బంజరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీ యూపీఎస్‌ బంజరపల్లి పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన స్థాయి, విద్యా పురోగతి, పాఠశాలలో వారి ప్రవర్తన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు తెలుసుకుంటూ, ఉపాధ్యాయులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి సర్పంచ్‌ భూక్య రమేష్‌ రాథోడ్‌ మాట్లాడుతూ విద్యార్థులంతా...