EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొత్త దొమ్మాట గ్రామ శాఖ అధ్యక్షుడిగా కర్రె నరసింహులు

    Author P శివశంకర్ | 18 Sep 2026, 07:55 PM | TELANGANA
    కొత్త దొమ్మాట గ్రామ శాఖ అధ్యక్షుడిగా కర్రె నరసింహులు

    పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మంజ మల్లేశం
    చేర్యాల మండలం, సెప్టెంబర్‌ 18, హిందుస్థాన్ మీడియా: మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఆదేశాల మేరకు, చేర్యాల కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మంజ మల్లేశం ఆధ్వర్యంలో కొత్తదొమ్మాట గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.ఈ ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా కర్రె నరసింహులు, గౌరవ అధ్యక్షుడిగా రాజు రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎనుముల కిషోర్, జనరల్‌ సెక్రటరీగా పచ్చిమట్ల పరశురాములు, సెక్రటరీగా తాండ్ర సంపత్ ఎన్నికయ్యారు.
    ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

    ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
    మండల పార్టీ అధ్యక్షుడు మంజ మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ దొమ్మాట గ్రామ సర్పంచ్‌ పర్వతం ఎల్లవ్వ చంద్రయ్య, మండల మహిళా అధ్యక్షురాలు రేకులపల్లి విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు మాదాసు మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శులు కొలిపాక వెంకటయ్య, శవల్ల రాజయ్య, మండల కార్యదర్శులు తాటికొండ సదానందం, కొలుపుల రాజేష్, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు కలీం పాషా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సొంటి రెక్కల కుమార్, మాజీ అధ్యక్షుడు కర్ణాకర్, కనకయ్య, మహేష్, నరేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.