EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లద్నూర్‌ పాఠశాలలో సోషల్ టీచర్ ను నియమించాలని సర్పంచ్ వినతి, స్పందించిన జెడ్పి సీఈఓ రమేష్

    Author R K SRINIVAS | 18 Sep 2026, 07:19 PM | TELANGANA
    లద్నూర్‌ పాఠశాలలో సోషల్ టీచర్ ను నియమించాలని సర్పంచ్ వినతి, స్పందించిన జెడ్పి సీఈఓ రమేష్

    ఎంఈవోకు వెంటనే ఆదేశాలు.. సర్పంచ్‌ రేణుక కనకరాజుకు ఆర్డర్‌ కాపీ అందజేత
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్‌ 18, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల పరిధిలోని లద్నూర్‌ ప్రభుత్వ పాఠశాలలో సోషల్‌ సబ్జెక్టు ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామ సర్పంచ్‌ కాసర్ల రేణుక కనకరాజు అధికారులను కోరారు. సోషల్‌ టీచర్‌ పదవీ విరమణ చేయడంతో గత నాలుగు నెలలుగా విద్యార్థులకు ఆ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
    పాఠశాలలో సోషల్‌ సబ్జెక్టు ఉపాధ్యాయుడి కొరత కారణంగా విద్యార్థులు విద్యాపరంగా నష్టపోతున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్పంచ్‌ రేణుక కనకరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్‌ వెంటనే సిద్దిపేట జిల్లా జడ్పీ సీఈవో, డీఈవో రమేష్‌ను కలిసి సమస్యను వివరించారు.
    వెంటనే ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు
    విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన జడ్పీ సీఈవో రమేష్‌.. సంబంధిత ఎంఈవోకు సోషల్‌ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్‌ కాపీని సర్పంచ్‌కు అందజేశారు.
    పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు స్పందించిన జడ్పీ సీఈవో రమేష్‌కు సర్పంచ్‌ రేణుక కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.