లద్నూర్ పాఠశాలలో సోషల్ టీచర్ ను నియమించాలని సర్పంచ్ వినతి, స్పందించిన జెడ్పి సీఈఓ రమేష్
ఎంఈవోకు వెంటనే ఆదేశాలు.. సర్పంచ్ రేణుక కనకరాజుకు ఆర్డర్ కాపీ అందజేత సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 18, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల పరిధిలోని లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు అధికారులను కోరారు. సోషల్ టీచర్ పదవీ విరమణ చేయడంతో గత నాలుగు నెలలుగా విద్యార్థులకు ఆ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడి కొరత కారణంగా విద్యార్థులు విద్యాపరంగా నష్టపోతున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్పంచ్ రేణుక కనకరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్ వెంటనే సిద్దిపేట...