EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మృతుల సమాధులపై నిర్లక్ష్యపు నీడ.. అధ్వానంగా మారిన స్మశాన వాటిక

    Author R K SRINIVAS | 18 Sep 2026, 07:10 PM | Array
    మృతుల సమాధులపై నిర్లక్ష్యపు నీడ.. అధ్వానంగా మారిన స్మశాన వాటిక

    అధ్వానంగా మారిన స్మశానవాటిక

    డ్రైనేజీ కోసం రూ.5 లక్షలు పైగా కేటాయింపు... పనుల్లో జాప్యం
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్‌ 18, హిందుస్థాన్ మీడియా: చనిపోయిన వారిని దేవుళ్లతో సమానంగా భావించే సంప్రదాయం ఉన్న మన సమాజంలో.. మృతులకు గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు పలికేందుకు నిర్మించిన స్మశానవాటికల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దూరు మండల కేంద్రంలోని స్మశానవాటికలో నెలకొన్న దుస్థితి ఇందుకు నిదర్శనంగా మారింది.

    మురుగునీటిలో సమాధులు.. పిచ్చిమొక్కలతో అవస్థలు
    మద్దూరు స్మశానవాటికలోకి కొంతకాలంగా మురుగునీరు ప్రవహిస్తుండటంతో అక్కడి సమాధులు నీటమునుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మశానవాటిక పరిసరాల్లో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో సమాధుల వద్దకు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
    మృతులకు గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన వైకుంఠధామం ప్రస్తుతం మురుగునీరు, పిచ్చిమొక్కల సమస్యలతో అధ్వానంగా మారిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి స్మశానవాటికను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

    డ్రైనేజీ కోసం రూ.5 లక్షలు పైగా కేటాయింపు : సర్పంచ్‌
    స్మశానవాటికలో మురుగునీటి సమస్యపై మద్దూరు సర్పంచ్‌ దామెర మల్లేశంను వివరణ కోరగా.. సమస్య పరిష్కారానికి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.5 లక్షలు పైగా కేటాయిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు.
    అయితే పైప్‌లైన్‌ ఏర్పాటు విషయంలో కొందరు అంగీకరిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారని, దీంతో పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోందని సర్పంచ్‌ వివరించారు. ఈ కారణంగానే స్మశానవాటికలో మురుగునీటి సమస్య ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు.మిగిలిన రైతులను కూడా ఒప్పించి పనులు త్వరగా పూర్తి అయ్యేటట్టు చేస్తానని తెలిపారు.