మృతుల సమాధులపై నిర్లక్ష్యపు నీడ.. అధ్వానంగా మారిన స్మశాన వాటిక
అధ్వానంగా మారిన స్మశానవాటిక డ్రైనేజీ కోసం రూ.5 లక్షలు పైగా కేటాయింపు... పనుల్లో జాప్యం సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 18, హిందుస్థాన్ మీడియా: చనిపోయిన వారిని దేవుళ్లతో సమానంగా భావించే సంప్రదాయం ఉన్న మన సమాజంలో.. మృతులకు గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు పలికేందుకు నిర్మించిన స్మశానవాటికల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దూరు మండల కేంద్రంలోని స్మశానవాటికలో నెలకొన్న దుస్థితి ఇందుకు నిదర్శనంగా మారింది. మురుగునీటిలో సమాధులు.. పిచ్చిమొక్కలతో అవస్థలు మద్దూరు స్మశానవాటికలోకి కొంతకాలంగా మురుగునీరు ప్రవహిస్తుండటంతో అక్కడి సమాధులు నీటమునుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మశానవాటిక పరిసరాల్లో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో సమాధుల వద్దకు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర...