EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేబర్తి బురుజుపై త్రివర్ణ పతాక ఆవిష్కరణ

    Author R K SRINIVAS | 17 Sep 2026, 05:35 PM | TELANGANA
    రేబర్తి బురుజుపై త్రివర్ణ పతాక ఆవిష్కరణ

    చరిత్రలో తొలిసారి బురుజుపై జాతీయ జెండా ఎగురవేత

    ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి: సర్పంచ్ నీరటి శ్రీనివాస్
    సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ ప్రజా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న రేబర్తి బురుజుపై గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ గురువారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.
    ఈ సందర్భంగా సర్పంచ్ నీరటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన సందర్భంగా ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించిన చారిత్రక గుర్తుగా నిలిచిన రేబర్తి బురుజుపై తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ చారిత్రక ప్రదేశం ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
    ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి
    రేబర్తి గ్రామ చరిత్ర, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన నేపథ్యాన్ని గ్రామ ప్రజలకు వివరించారు. భవిష్యత్ తరాలు కూడా చారిత్రక ఉద్యమాల స్ఫూర్తిని గుర్తుంచుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో బియ్య రమేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.