రేబర్తి బురుజుపై త్రివర్ణ పతాక ఆవిష్కరణ

చరిత్రలో తొలిసారి బురుజుపై జాతీయ జెండా ఎగురవేత ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి: సర్పంచ్ నీరటి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, రేబర్తి, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ ప్రజా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న రేబర్తి బురుజుపై గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ గురువారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా సర్పంచ్ నీరటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన సందర్భంగా ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్...