EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బైరాన్ పల్లి అమరవీరులకు ఘన నివాళులు

    Author R K SRINIVAS | 17 Sep 2026, 12:10 PM | TELANGANA
    బైరాన్ పల్లి అమరవీరులకు ఘన నివాళులు

    చారిత్రక బురుజు వద్ద పుష్పాంజలి ఘటించిన టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్ రెడ్డి
    సిద్దిపేట జిల్లా, మద్దూరు–దూల్మిట్ట, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వీర భైరాన్‌పల్లిలోని చారిత్రక బురుజు వద్ద తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి, ఉమ్మడి మండల మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
    ఈ సందర్భంగా గిరి కొండల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం అమరవీరులు చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వారి త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.
    తెలంగాణ చరిత్రలో భైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి పోరాట చరిత్ర, త్యాగాల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
    ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.