బైరాన్ పల్లి అమరవీరులకు ఘన నివాళులు
చారిత్రక బురుజు వద్ద పుష్పాంజలి ఘటించిన టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్ రెడ్డి సిద్దిపేట జిల్లా, మద్దూరు–దూల్మిట్ట, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వీర భైరాన్పల్లిలోని చారిత్రక బురుజు వద్ద తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి, ఉమ్మడి మండల మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గిరి కొండల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం అమరవీరులు చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా...