EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చినుకు పడింది....రైతు ముఖం వెలిగింది.!

    Author R K SRINIVAS | 14 Sep 2026, 01:25 PM | TELANGANA
    చినుకు పడింది....రైతు ముఖం వెలిగింది.!

    వర్షంతో పంటలకు ఊపిరి.. సాగుపై అన్నదాతల్లో ఆశలు

    మోస్తరు వర్షంతో ఊరట.. భూగర్భ జలాల పెరుగుదలకు మరిన్ని వర్షాలు అవసరం
    సిద్దిపేట జిల్లా, మద్దూరు–దూల్మిట్ట, సెప్టెంబర్ 14, హిందుస్థాన్ మీడియా: ఎట్టకేలకు మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాలు ఆలస్యం కావడంతో పంటల పరిస్థితిపై ఆందోళన చెందిన అన్నదాతలకు తాజా వర్షం కొంత ఊరటనిచ్చింది. పొలాల్లో తేమ పెరగడంతో పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు.
    ఇటీవల వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మోస్తరు వర్షం సాగు పనులకు కొంత ఊరటనిచ్చింది. ఇప్పటికే పొలాల్లో సాగు చేసిన పంటలకు తేమ అందడంతో మొక్కలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు ఇదే విధంగా కరుణించి మరిన్ని వర్షాలు కురిపిస్తే పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
    అయితే ప్రస్తుత వర్షం పంటలకు కొంత మేలు చేసినప్పటికీ భూగర్భ జలాల పెరుగుదలకు మరిన్ని వర్షాలు అవసరమని అన్నదాతలు చెబుతున్నారు. బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పెరగాలంటే రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.
    వర్షాలు సకాలంలో కురిస్తే పంటలకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో సాగుపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. “చినుకు పడితే చాలు.. రైతన్న ముఖంలో చిరునవ్వే” అన్నట్లుగా కురిసిన వర్షం అన్నదాతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.