చినుకు పడింది....రైతు ముఖం వెలిగింది.!
వర్షంతో పంటలకు ఊపిరి.. సాగుపై అన్నదాతల్లో ఆశలు మోస్తరు వర్షంతో ఊరట.. భూగర్భ జలాల పెరుగుదలకు మరిన్ని వర్షాలు అవసరం సిద్దిపేట జిల్లా, మద్దూరు–దూల్మిట్ట, సెప్టెంబర్ 14, హిందుస్థాన్ మీడియా: ఎట్టకేలకు మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాలు ఆలస్యం కావడంతో పంటల పరిస్థితిపై ఆందోళన చెందిన అన్నదాతలకు తాజా వర్షం కొంత ఊరటనిచ్చింది. పొలాల్లో తేమ పెరగడంతో పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు. ఇటీవల వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు మోస్తరు వర్షం సాగు పనులకు కొంత ఊరటనిచ్చింది. ఇప్పటికే పొలాల్లో సాగు చేసిన పంటలకు తేమ అందడంతో మొక్కలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని...