EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

    Author THADEM PRASHANTH | 11 Sep 2026, 06:13 PM | TELANGANA
    గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్

    పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

    పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలి: ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్
    రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిరిసిల్ల పట్టణ పోలీసులు సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీస్ కమిటీ సభ్యులతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
    ఈ సందర్భంగా పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, నిమజ్జనం వరకు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
    గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ, పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించేలా పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే గణేష్ ఉత్సవాలు సోదరభావం, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.