గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
పీస్ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలి: ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిరిసిల్ల పట్టణ పోలీసులు సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీస్ కమిటీ సభ్యులతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, నిమజ్జనం వరకు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు,...