EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అధిక ధరలకు ఎరువులను విక్రయించిన.. ఇతర ఎరువులను లింకు చేసిన కఠిన చర్యలు: DAO

    Author B SRAVAN KUMAR | 11 Sep 2026, 06:07 PM | TELANGANA
    అధిక ధరలకు ఎరువులను విక్రయించిన.. ఇతర ఎరువులను లింకు చేసిన కఠిన చర్యలు: DAO

    ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

    ఈ-పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలి: డీఏఓ స్వరూపరాణి
    సిద్దిపేట జిల్లా, కొండపాక, సెప్టెంబర్ 11, హిందుస్థాన్ మీడియా: అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, రైతులకు అవసరమైన ఎరువులతో పాటు ఇతర ఎరువులను లింకు చేసి విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. కొండపాక మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
    ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో ఎరువుల నిల్వలు, విత్తనాల విక్రయాలు, రికార్డులు, రసీదులు, బిల్లులను డీఏఓ క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన అన్ని రికార్డులను తప్పనిసరిగా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. షాపుల్లో ఏర్పాటు చేసిన బోర్డుల్లో ఎరువులు, విత్తనాల నిల్వలు, విక్రయాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.
    ఎరువుల విక్రయాలను తప్పనిసరిగా ఈ-పాస్ విధానం ద్వారా మాత్రమే నిర్వహించాలని స్వరూపరాణి సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం, ఒక ఎరువును కొనుగోలు చేయాలంటే మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని లింకు చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణ యజమానులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.