అధిక ధరలకు ఎరువులను విక్రయించిన.. ఇతర ఎరువులను లింకు చేసిన కఠిన చర్యలు: DAO

ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు ఈ-పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరపాలి: డీఏఓ స్వరూపరాణి సిద్దిపేట జిల్లా, కొండపాక, సెప్టెంబర్ 11, హిందుస్థాన్ మీడియా: అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, రైతులకు అవసరమైన ఎరువులతో పాటు ఇతర ఎరువులను లింకు చేసి విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. కొండపాక మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో ఎరువుల నిల్వలు, విత్తనాల విక్రయాలు, రికార్డులు, రసీదులు, బిల్లులను డీఏఓ క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు ఎరువులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన అన్ని...