EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

    Author B SRAVAN KUMAR | 10 Sep 2026, 05:48 PM | TELANGANA
    వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

    బందారం, దుద్దెడలో ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి
    సిద్దిపేట జిల్లా, కొండపాక, సెప్టెంబర్ 10, హిందుస్థాన్ మీడియా: వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని కొండపాక మండలంలోని బందారం, దుద్దెడ గ్రామాల్లో గ్రామ రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆమె సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
    ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు ర్యాగాల్ల దుర్గయ్య, దుద్దెడ సర్పంచ్ మిద్దె శివకుమార్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డమీది రామస్వామి, గ్రామ రజక సంఘం అధ్యక్షులు బుచ్చిగారి మల్లయ్య, ర్యాగాల్ల బుచ్చయ్య, వార్డు మెంబర్ పెద్దంకుల దేవేందర్, ర్యాగాల్ల నర్సింలు, లక్ష్మణ్, చిట్యాల నర్సింలు, బస్వరాజు, రవి, పెద్దోళ్ల బాలయ్య, మండవ నర్సింలు, ర్యాగాల్ల రాజు, పెద్దోళ్ల యాదగిరి, కర్రోళ్ల రాములు, వేముల కర్ణాకర్, బొగ్గుట అశోక్, ర్యాగాల్ల మహేష్, శంకర్, సర్వయ్య, బిక్షపతి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.