వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
బందారం, దుద్దెడలో ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి సిద్దిపేట జిల్లా, కొండపాక, సెప్టెంబర్ 10, హిందుస్థాన్ మీడియా: వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని కొండపాక మండలంలోని బందారం, దుద్దెడ గ్రామాల్లో గ్రామ రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆమె సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ...