EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నిరసన

    Author P శివశంకర్ | 09 Sep 2026, 08:37 PM | TELANGANA
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నిరసన

    40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

    చేర్యాలలో నల్ల బ్యాడ్జీలతో బీజేపీ నిరసన.. తహసీల్దార్‌కు వినతి
    సిద్దిపేట జిల్లా, చేర్యాల, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు మేరకు చేర్యాల మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం చేర్యాల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
    ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంజీవులు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్ర మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు, సీనియర్ నాయకులు ముచ్చేంతుల సిద్ధారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నే సత్యవర్ధన్, కొట్టే చంద్రమౌళి, మండల ప్రధాన కార్యదర్శి తౌట బాలరాజు, నాగపూరి ఉపసర్పంచ్ ఆవుల సందీప్, మండల ఉపాధ్యక్షులు కేతోజి చంద్రశేఖర్ చారి, మండల కార్యదర్శి పోలోజు రవి చారి, రాంపూర్ ఉపసర్పంచ్ నిమ్మ లక్ష్మారెడ్డి, బీజేవైఎం నాయకులు సోగాల మనోజ్, మాచర్ల ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.