ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నిరసన
40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేర్యాలలో నల్ల బ్యాడ్జీలతో బీజేపీ నిరసన.. తహసీల్దార్కు వినతి సిద్దిపేట జిల్లా, చేర్యాల, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: రాష్ట్రంలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు మేరకు చేర్యాల మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం చేర్యాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంజీవులు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.15...