EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ భాషా జ్యోతి కాళోజిని ఆదర్శంగా తీసుకోవాలి:HM రాజమణి

    Author P శివశంకర్ | 09 Sep 2026, 08:00 PM | TELANGANA
    తెలంగాణ భాషా జ్యోతి కాళోజిని ఆదర్శంగా తీసుకోవాలి:HM రాజమణి

    తెలంగాణ భాషను పరిరక్షించే బాధ్యత విద్యార్థులదే

    కాళోజీ ఆశయాలతో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం పెంపొందించుకోవాలి
    సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ భాషా జ్యోతి, ప్రజాకవి కాళోజీ నారాయణరావును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడవేర్గు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రాజమణి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.
    ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం నేటి విద్యార్థుల బాధ్యత అని రాజమణి అన్నారు. కాళోజీ రచనలు, ఆయన పోరాట స్ఫూర్తిని విద్యార్థులు తెలుసుకుని సమాజంలో మంచి మార్పు కోసం ముందుకు సాగాలని సూచించారు.
    తెలుగు ఉపాధ్యాయులు కాంతికృష్ణ మాట్లాడుతూ కాళోజీ చూపిన బాటలో విద్యార్థుల్లో అన్యాయాన్ని ప్రశ్నించే, ఎదిరించే ధైర్యం ఉండాలని అన్నారు. తెలంగాణ భాషను నేర్చుకోవడంతో పాటు దానిని పరిరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజాలపై వేసుకోవాలని పిలుపునిచ్చారు.
    ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గులు, పద్యాలు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి శుభం చారి చిత్రించిన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.
    కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, చంద్రశేఖర్ రావు, లింగాచారి, రామకృష్ణ, అరుణ, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

    తెలంగాణ భాషా జ్యోతి కాళోజిని ఆదర్శంగా తీసుకోవాలి:HM రాజమణి  - Additional Image