తెలంగాణ భాషా జ్యోతి కాళోజిని ఆదర్శంగా తీసుకోవాలి:HM రాజమణి
తెలంగాణ భాషను పరిరక్షించే బాధ్యత విద్యార్థులదే కాళోజీ ఆశయాలతో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం పెంపొందించుకోవాలి సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ భాషా జ్యోతి, ప్రజాకవి కాళోజీ నారాయణరావును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడవేర్గు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రాజమణి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం నేటి విద్యార్థుల బాధ్యత అని రాజమణి అన్నారు. కాళోజీ రచనలు, ఆయన...