EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కపీశ్వర ట్రాక్టర్స్ - పవర్‌ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్

    Author R K SRINIVAS | 09 Sep 2026, 06:46 PM | TELANGANA
    కపీశ్వర ట్రాక్టర్స్ - పవర్‌ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్

    బెక్కల్‌లో 30–40 ట్రాక్టర్లకు ఉచిత ఆయిల్‌ చేంజ్‌, మైనర్‌ రిపేర్లు
    సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట: రైతులకు వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ల నిర్వహణ భారం తగ్గించేందుకు బెక్కల్ గ్రామంలో ఎస్కార్ట్ కంపెనీకి చెందిన కపీశ్వర ట్రాక్టర్స్–పవర్‌ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్, మైనర్ రిపేర్ల క్యాంపు నిర్వహించారు. పవర్‌ట్రాక్ షోరూం డీలర్లు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు ట్రాక్టర్లను పరిశీలించి ఉచితంగా సర్వీసింగ్ చేయడంతో పాటు చిన్నపాటి లోపాలను గుర్తించి మైనర్ రిపేర్లు చేశారు.
    బెక్కల్, మద్దూరు మండలాల పరిధి నుంచి సుమారు 30 నుంచి 40 మంది ట్రాక్టర్ యజమానులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం ద్వారా పెద్ద రిపేర్లకు దారితీయకుండా అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఇలాంటి ఉచిత సర్వీసింగ్ కార్యక్రమాలు రైతులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తాయని తెలిపారు.
    ప్రతి నెలా చేర్యాల, కొండపాక, కొమురవెల్లి, నంగునూరు, అర్జున్‌పట్ల ప్రాంతాల్లో ఉచిత సర్వీసింగ్, మైనర్ రిపేర్ల క్యాంపులను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
    ఈ సందర్భంగా ఉచిత సర్వీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన షోరూం డీలర్లను రైతులు, ట్రాక్టర్ యజమానులు అభినందించారు. అనంతరం బెక్కల్ గ్రామ సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ అరవింద్లను షోరూం డీలర్లు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్ఎం అరుణ్, టీఎస్ఎం రాకేష్, సూపర్‌వైజర్లు శ్రావణ్, మహేష్, మెకానిక్ బృందం పాల్గొన్నారు.

    కపీశ్వర ట్రాక్టర్స్ - పవర్‌ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్  - Additional Image