కపీశ్వర ట్రాక్టర్స్ - పవర్ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్
బెక్కల్లో 30–40 ట్రాక్టర్లకు ఉచిత ఆయిల్ చేంజ్, మైనర్ రిపేర్లు సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట: రైతులకు వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ల నిర్వహణ భారం తగ్గించేందుకు బెక్కల్ గ్రామంలో ఎస్కార్ట్ కంపెనీకి చెందిన కపీశ్వర ట్రాక్టర్స్–పవర్ట్రాక్ చేర్యాల షోరూం ఆధ్వర్యంలో ఉచిత సర్వీసింగ్, మైనర్ రిపేర్ల క్యాంపు నిర్వహించారు. పవర్ట్రాక్ షోరూం డీలర్లు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎల్. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు ట్రాక్టర్లను పరిశీలించి ఉచితంగా సర్వీసింగ్ చేయడంతో పాటు చిన్నపాటి లోపాలను గుర్తించి మైనర్ రిపేర్లు చేశారు. బెక్కల్, మద్దూరు మండలాల పరిధి నుంచి సుమారు 30 నుంచి 40 మంది...