EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వ్యవసాయ బావులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతుల ధర్నా

    Author THADEM PRASHANTH | 05 Sep 2026, 11:51 AM | TELANGANA
    వ్యవసాయ బావులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతుల ధర్నా

    మాచాపూర్ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతుల ఆందోళన
    సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం:
    చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ బావులకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.
    వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావులకు నిర్ణీత సమయం కాకుండా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని అధికారులను కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.