EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూరులో ప్రజావాణికి ఒక్క అర్జీ కూడా రాని వైనం

    Author R K SRINIVAS | 24 Aug 2026, 08:09 PM | TELANGANA
    మద్దూరులో ప్రజావాణికి ఒక్క అర్జీ కూడా రాని వైనం

    దరఖాస్తుల కోసం అధికారుల నిరీక్షణ
    సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 24: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మద్దూరులో స్పందన కరువైంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడంతో అధికారులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి స్పందన లేకపోవడంపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి సమస్యలు ఉంటే ప్రజావాణి వేదికగా అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చని అధికారులు తెలిపారు.
    అధికారులంతా సిద్ధం.. ప్రజలే కరువు!
    >మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు హాజరైనప్పటికీ ఒక్క అర్జీ కూడా రాకపోవడంతో ప్రజావాణి కార్యక్రమం వెలవెలబోయింది. ప్రజలకు ప్రజావాణి కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించి, సమస్యలు ఉన్నవారు నిర్భయంగా అర్జీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
    ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏజీ రహీమ్, ఎంపీడీవో రామ్మోహన్, మద్దూరు ఎస్‌ఐ అసిఫ్, వైద్యాధికారి రజిత, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఏపీవో మంజుల, విద్యుత్ శాఖ ఏఈ రాజు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శోభారాణి, ఎస్సీ హాస్టల్ వార్డెన్ చక్రధర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.