మద్దూరులో ప్రజావాణికి ఒక్క అర్జీ కూడా రాని వైనం

దరఖాస్తుల కోసం అధికారుల నిరీక్షణ సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 24: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మద్దూరులో స్పందన కరువైంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడంతో అధికారులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి స్పందన లేకపోవడంపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్,...