EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజా సంక్షేమమే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    Author M KIRAN KUMAR | 24 Aug 2026, 02:05 PM | TELANGANA
    ప్రజా సంక్షేమమే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    రాంసాగర్‌లో ఘనంగా ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి: సర్పంచ్

    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ అక్కెనపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా గ్రామపంచాయతీ తరఫున నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
    స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, గ్రామపంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
    ఈ కార్యక్రమంలో జీపీఓ రాధిక, పంచాయతీ కార్యదర్శి వీణ, కారోబారి తాడూరి రాజలింగం, వార్డు సభ్యుడు గంగుల ఐలయ్య, రేషన్ డీలర్ గుజ్జు ప్రేమలత, గ్రామపంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.