ప్రజా సంక్షేమమే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రాంసాగర్‌లో ఘనంగా ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి: సర్పంచ్ హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ అక్కెనపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల...