EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాధ్యతగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన రవీందర్ శర్మ

    Author THADEM PRASHANTH | 03 Aug 2026, 06:18 PM | Array
    బాధ్యతగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన రవీందర్ శర్మ

    పోగొట్టుకున్న ఒరిజినల్ టీసీ, మెమోలను విద్యార్థికి అప్పగింపు.. అభినందించిన పోలీసులు


    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: మర్రి ముచ్చాల నుంచి చేర్యాలకు వచ్చే రహదారిలో విద్యార్థి పోగొట్టుకున్న ఒరిజినల్ టీసీ, మెమోలను బాధ్యతగా వ్యవహరించి తిరిగి అందించిన చేర్యాలకు చెందిన ఇంగ్లీష్ లెక్చరర్ జి .రవీందర్ శర్మ స్థానికుల ప్రశంసలు అందుకున్నారు.
    ముస్తాల గ్రామానికి చెందిన జస్వంత్ అనే విద్యార్థి అనుకోకుండా తన ఒరిజినల్ టీసీ, మెమోలను రహదారిలో పోగొట్టుకున్నాడు. అదే మార్గంలో వెళ్తున్న రవీందర్ శర్మకు ఆ విద్యా పత్రాలు కనిపించడంతో వాటిని తన వద్ద ఉంచుకోకుండా, సంబంధిత విద్యార్థిని గుర్తించేందుకు సుమారు రెండు గంటలపాటు శ్రమించారు.
    చివరకు జస్వంత్‌ను గుర్తించి, చేర్యాల హెడ్ కానిస్టేబుల్ సమక్షంలో అతనికి ఒరిజినల్ టీసీ, మెమోలను భద్రంగా అందజేశారు.
    బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థికి విలువైన పత్రాలను అందించిన రవీందర్ శర్మను పోలీసులు అభినందించారు. ఆయన చూపిన నిజాయితీ, సామాజిక బాధ్యతను స్థానికులు కొనియాడుతూ, ఇలాంటి చర్యలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.