EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేదల వైద్య సేవకుడిగా గుర్తింపు పొందిన మల్లేశం మృతి

    Author THADEM PRASHANTH | 24 Aug 2026, 08:23 AM | TELANGANA
    పేదల వైద్య సేవకుడిగా గుర్తింపు పొందిన మల్లేశం మృతి

    ఆపద్బాంధవుడిని కోల్పోయిన పెద్ద రాంచర్ల, చేర్యాల ప్రాంతాలు

    ఆకస్మిక మృతితో విషాదఛాయలు.. సేవలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
    పెద్ద రాంచర్ల, హిందుస్థాన్ మీడియా: పెద్ద రాంచర్ల గ్రామ పెద్ద, సర్పంచ్ వల్లాల మల్లేశం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి వార్తతో పెద్ద రాంచర్లతో పాటు చేర్యాల ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    చేర్యాల ప్రాంతంలో ఆయన అందించిన వైద్య సేవలు ప్రజలు ఎప్పటికీ మరువలేనివని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ పేదల ఆపద్బాంధవుడిగా మల్లేశం మంచి పేరు సంపాదించుకున్నారు.
    ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని ఎంతోమంది పేదలకు తనవంతు సహాయం అందించడంతో పాటు, వారి కష్టాల్లో తోడుగా నిలిచేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. గ్రామ పెద్దగా, సర్పంచ్‌గా ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేసిన ఆయన ఆకస్మిక మరణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.వల్లాల మల్లేశం మృతి పట్ల పలువురు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
    వల్లాల మల్లేశం గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని హిందుస్థాన్ మీడియా ప్రార్థిస్తోంది.