పేదల వైద్య సేవకుడిగా గుర్తింపు పొందిన మల్లేశం మృతి
ఆపద్బాంధవుడిని కోల్పోయిన పెద్ద రాంచర్ల, చేర్యాల ప్రాంతాలు ఆకస్మిక మృతితో విషాదఛాయలు.. సేవలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు పెద్ద రాంచర్ల, హిందుస్థాన్ మీడియా: పెద్ద రాంచర్ల గ్రామ పెద్ద, సర్పంచ్ వల్లాల మల్లేశం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి వార్తతో పెద్ద రాంచర్లతో పాటు చేర్యాల ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేర్యాల ప్రాంతంలో ఆయన అందించిన వైద్య సేవలు ప్రజలు ఎప్పటికీ మరువలేనివని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ పేదల ఆపద్బాంధవుడిగా మల్లేశం మంచి పేరు సంపాదించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని ఎంతోమంది పేదలకు తనవంతు సహాయం అందించడంతో...