EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీఏపీ కావాలంటే మరో ఎరువు కొనాల్సిందేనా..? శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్ నిర్వాకం

    Author THADEM PRASHANTH | 23 Aug 2026, 07:19 PM |
    డీఏపీ కావాలంటే మరో ఎరువు కొనాల్సిందేనా..? శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్ నిర్వాకం

    చిన్నకోడూరు మండలంలోని శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్
    లింక్‌ సేల్‌పై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేయాలని డిమాండ్
    హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: పంట సాగు కోసం ఎరువులు కొనుగోలు చేసే రైతులకు కొందరు వ్యాపారులు పెడుతున్న నిబంధనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నకోడూరు మండలంలోని శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ దుకాణంలో డీఏపీ కొనుగోలు చేయాలంటే మరో ఎరువును కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పడంతో తాను చేసేదేమీ లేక అదనపు ఎరువును కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఓ రైతు ఆరోపించారు.
    రైతు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల పొలంలో నాట్లు వేసేందుకు అవసరమైన ఎరువుల కోసం సదరు దుకాణానికి వెళ్లారు. తొలుత 20:20 ఎరువుకు ఒక్క బస్తా రూ.2,150 ధర ఉందని, రెండు బస్తాలు కావాలంటే రూ.4,300 అవుతుందని చెప్పినట్లు రైతు పేర్కొన్నారు. దీంతో డీఏపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే డీఏపీ ఇవ్వాలంటే మరో ఎరువును కూడా తప్పనిసరిగా తీసుకోవాలని దుకాణదారు చెప్పడంతో చేసేదేమీ లేక కొనుగోలు చేసినట్లు వాపోయారు.
    రైతు వద్ద ఉన్న బిల్లులో 50 కిలోల డీఏపీ రెండు బస్తాలకు రూ.1,350 చొప్పున మొత్తం రూ.2,700, మరో 50 కిలోల ఎరువుకు రెండు బస్తాలకు రూ.700 చొప్పున రూ.1,400గా నమోదు చేశారు. మొత్తం బిల్లు రూ.4,100గా ఉంది.
    డీఏపీతో మరో ఎరువును లింక్ చేయడమెందుకు?
    డీఏపీ అవసరమున్న రైతుకు అదే ఎరువును మాత్రమే విక్రయించకుండా, మరో ఉత్పత్తిని కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని చెప్పడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతుకు అవసరం లేని ఎరువును కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని రైతు కోరుతున్నారు.
    అధికారులు విచారణ చేయాలి
    దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, విక్రయ బిల్లులు, ఎరువుల నిల్వలు, ధరల వివరాలు, రైతులకు విక్రయించిన విధానం తదితర అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని రైతు కోరుతున్నారు.
    “డీఏపీ కోసం వెళ్లిన రైతుకు మరో ఎరువు కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు అవసరాన్ని బట్టి ఎరువులు విక్రయిస్తున్నారా.. లేక లింక్ సేల్ చేస్తున్నారా?” అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
    రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చిన్నకోడూరు మండల వ్యవసాయ శాఖ అధికారులు శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్‌ను తనిఖీ చేసి, వాస్తవాలను వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.ఈ ఒక్క ఫర్టిలైజర్ షాప్ లోనే ఇలా రైతులను వేధిస్తున్నారా లేక మండల వ్యాప్తంగా ఇదే దందా నడుస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ రకమైన నిబంధనలు తీసుకొచ్చిందా అనే విషయంఅధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది