డీఏపీ కావాలంటే మరో ఎరువు కొనాల్సిందేనా..? శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్ నిర్వాకం

చిన్నకోడూరు మండలంలోని శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ లింక్‌ సేల్‌పై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేయాలని డిమాండ్ హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: పంట సాగు కోసం ఎరువులు కొనుగోలు చేసే రైతులకు కొందరు వ్యాపారులు పెడుతున్న నిబంధనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నకోడూరు మండలంలోని శ్రీ రామకృష్ణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ దుకాణంలో డీఏపీ కొనుగోలు చేయాలంటే మరో ఎరువును కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పడంతో తాను చేసేదేమీ లేక అదనపు ఎరువును కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఓ రైతు ఆరోపించారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల పొలంలో నాట్లు వేసేందుకు అవసరమైన ఎరువుల కోసం...