EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మర్రిముచ్చాల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    Author M KIRAN KUMAR | 23 Aug 2026, 08:08 AM | TELANGANA
    మర్రిముచ్చాల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్ జంగని రవి
    హిందుస్థాన్ మీడియా: మర్రిముచ్చాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగని రవి, జీపీఓ స్వామి, పంచాయతీ కార్యదర్శి విక్రం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ జంగని రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్డులు అందుకున్న గ్రామస్తులు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.