మర్రిముచ్చాల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేసిన సర్పంచ్ జంగని రవి హిందుస్థాన్ మీడియా: మర్రిముచ్చాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగని రవి, జీపీఓ స్వామి, పంచాయతీ కార్యదర్శి విక్రం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగని రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు....