EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి: రామకృష్ణ

    Author R K SRINIVAS | 21 Aug 2026, 09:04 AM | TELANGANA
    తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి: రామకృష్ణ

    ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి. రామకృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో, అలాగే వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటలైన కందులు, పెసలు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వివరించారు.అలాగే రైతులు వీబీజీ–రామ్ పథకం ద్వారా నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్‌వెల్ రీచార్జ్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ మంజుల, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏఈవోలు రాజు, కల్పన, అనుషతో పాటు రైతులు సత్యనారాయణ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.