తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి: రామకృష్ణ

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన హిందుస్థాన్ మీడియా, మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి. రామకృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో, అలాగే వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటలైన కందులు, పెసలు, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం...