EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు: సర్పంచ్ కనకచంద్రం

    Author R K SRINIVAS | 20 Aug 2026, 09:35 PM | TELANGANA
    అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు: సర్పంచ్ కనకచంద్రం

    పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 20: మద్దూరు మండల పరిధిలోని గాగిళ్లపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం గురువారం పంపిణీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మేక యాదమ్మ, బింగి పోచయ్య, యామ ఉమారాణి, మేక రమ, గౌండ్ల లింగవ్వ, చెవిటి మానసలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
    ఈ సందర్భంగా సర్పంచ్ కనక చంద్రం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
    అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.
    ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామపంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.