అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు: సర్పంచ్ కనకచంద్రం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 20: మద్దూరు మండల పరిధిలోని గాగిళ్లపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం గురువారం పంపిణీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మేక యాదమ్మ, బింగి పోచయ్య, యామ ఉమారాణి, మేక రమ, గౌండ్ల లింగవ్వ, చెవిటి మానసలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక చంద్రం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు....