EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

    Author R K SRINIVAS | 20 Aug 2026, 05:18 PM | TELANGANA
    మద్దూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

    కస్తూర్బా విద్యార్థినులకు అరటిపండ్ల పంపిణీ

    ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కృషి చిరస్మరణీయం: కాంగ్రెస్ నాయకులు
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 20: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మద్దూరు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు అరటిపండ్లు పంపిణీ చేశారు.
    ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సూచనలకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నుముకలా పనిచేయాలని సూచించారు.
    గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.
    దేశ అభివృద్ధితో పాటు సాంకేతిక రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారత నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, రామడుగు బాలరాజ్, పుల్లూరి రాజు, మర్మముల సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్ కాటం బాలయ్య, షౌకత్ అలీ, తాజ్ మహ్మద్, బూరుగు రాజు, బూరుగు శంకర్, రాచకొండ సాయిలు, మౌలానా, పండగ వేణుగోపాల్, చిలుక రాంబాబు, పాకాల ఇసాక్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    మద్దూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు  - Additional Image