EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మారెళ్ల భాస్కర్ రెడ్డి

    Author R K SRINIVAS | 18 Aug 2026, 06:22 PM | TELANGANA
    మద్దూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా  మారెళ్ల భాస్కర్ రెడ్డి

    పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: నూతన అధ్యక్షుడు
    హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 18: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మారెళ్ల భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
    ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
    తనకు సహకరించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    అనంతరం భాస్కర్ రెడ్డి కొమ్మూరి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.