మద్దూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మారెళ్ల భాస్కర్ రెడ్డి

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: నూతన అధ్యక్షుడు హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 18: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మారెళ్ల భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తనకు సహకరించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్...