EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి - 11 ఫిర్యాదులు స్వీకరణ

    Author P శివశంకర్ | 17 Aug 2026, 06:38 PM | Array
    ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి -  11 ఫిర్యాదులు స్వీకరణ

    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండలంలోని ముస్త్యాల రైతు వేదికలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు.
    అందులో ఇరిగేషన్ ఏఈకి సంబంధించిన సమస్యలపై 4 ఫిర్యాదులు, భూ సమస్యలపై 3, రైతు భరోసాపై 1, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1, ఉపాధి హామీ పథకం నిధుల కోసం 1, తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం 1 ఫిర్యాదు అందింది.
    ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓ ప్రణయ్, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసిల్దార్ శ్రీవాస్య సందీప్ ఫిర్యాదులు స్వీకరించారు