ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి - 11 ఫిర్యాదులు స్వీకరణ
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండలంలోని ముస్త్యాల రైతు వేదికలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో ఇరిగేషన్ ఏఈకి సంబంధించిన సమస్యలపై 4 ఫిర్యాదులు, భూ సమస్యలపై 3, రైతు భరోసాపై 1, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1, ఉపాధి హామీ పథకం నిధుల కోసం 1, తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం 1 ఫిర్యాదు అందింది. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల...