EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజావాణి : మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్

    Author R K SRINIVAS | 16 Aug 2026, 07:06 PM | TELANGANA
    ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజావాణి : మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్

    ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 16: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలోని సభాభవనంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
    ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
    ఏ సమస్యపైనైనా అర్జీ చేసుకోవచ్చు
    ఇందిరమ్మ ఇళ్లు: నూతన ఇళ్ల మంజూరు, అర్హత ఉన్నప్పటికీ ఇల్లు మంజూరు కాని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
    రేషన్ కార్డులు: కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించవచ్చు.
    పింఛన్లు: ఆసరా, ఇతర ప్రభుత్వ పింఛన్లు అందకపోతే సంబంధిత సమస్యపై అర్జీ ఇవ్వవచ్చు.
    భూ సమస్యలు: ధరణి పోర్టల్‌లో తప్పులు, భూ వివాదాలు, మ్యూటేషన్లు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.
    ఉపాధి, ఉద్యోగ సమస్యలు: ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తులు సమర్పించవచ్చు.
    వైద్యం, ఆర్థిక సహాయం: అత్యవసర వైద్య ఖర్చులు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం అర్జీలు ఇవ్వవచ్చని ఎంపీడీవో తెలిపారు.
    ప్రజలు ప్రజావాణికి హాజరయ్యే సమయంలో సమస్యను స్పష్టంగా రాసిన అర్జీ, ఫోన్ నంబర్, పూర్తి చిరునామా, సంబంధిత ఆధారాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని ఎంపీడీవో రామ్మోహన్ సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.