ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజావాణి : మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్
ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 16: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలోని సభాభవనంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించి అర్జీలు...