EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి

    Author THADEM PRASHANTH | 15 Aug 2026, 08:50 PM | TELANGANA
    చేర్యాల మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి

    ముస్త్యాల రైతు వేదికలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
    ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముస్త్యాల రైతు వేదికలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమానికి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నారు. మండల ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.
    చేర్యాల మండల ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.