చేర్యాల మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి

ముస్త్యాల రైతు వేదికలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముస్త్యాల రైతు వేదికలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నారు. మండల ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లి...